భారతీయులకు ఇల్లు అద్దెకివ్వం అంటున్న బ్రిటన్ వాసులు

- November 09, 2017 , by Maagulf
భారతీయులకు ఇల్లు అద్దెకివ్వం అంటున్న బ్రిటన్ వాసులు

వాసనలు వెంటాడే కూరలు వండుకునే భారతీయులు, పాకిస్థానీలకు ఇళ్లు అద్దెకు ఇవ్వనంటూ భీష్మించుకుని కూర్చున్న బ్రిటన్‌వాసికి కోర్టులో చుక్కెదురైంది. 69ఏళ్ల ఫెర్జస్‌ విల్సన్‌కు ఈశాన్య ఇంగ్లండ్‌లో వందల కొద్దీ ఇళ్లున్నాయి. భారత్‌, పాకిస్థాన్‌లకు చెందిన ఓ వర్ణం ఛాయ కలిగిన వ్యక్తులకు ఇళ్లు అద్దెకు ఇవ్వనని సమానత్వం, మానవ హక్కుల కమిషన్‌ ముందు ఆయన తెగేసిచెప్పారు. దీంతో కేసు మైడ్‌స్టోన్‌ కౌంటీ కోర్టుకు ఎక్కింది. అక్కడ విల్సన్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 'ఈయన విధానాలు న్యాయవిరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి వాటికి మన సమాజంలో చోటులేదు'అని న్యాయమూర్తి రిచర్డ్‌ పాల్డెన్‌ తేల్చిచెప్పారు. కోర్టు తీర్పును వ్యతిరేకించి వివక్ష చూపాలని చూస్తే.. కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని స్పష్టంచేశారు.

'కూరల వాసన వచ్చే ఇల్లు మాకు వద్దంటూ కొందరు తెగేసి చెబుతున్నారు. దీంతో ఇళ్లను బాగుచేయించేందుకు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుబెట్టాల్సి వస్తోంది. అందుకే భారతీయులు, పాకిస్థానీలకు ఇళ్లు అద్దెకి ఇవ్వనని చెప్పాను'అంటూ తన వాదనను విల్సన్‌ సమర్థించుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com