అంగారక యాత్రకు 1,38,899 భారతీయులు

- November 09, 2017 , by Maagulf
అంగారక యాత్రకు 1,38,899 భారతీయులు

ప్రపంచవ్యాప్తంగా బుధ యాత్రకు వెళ్తున్నవారిలో భారతీయులు కూడా చేరారు. ఈ యాత్ర కోసం భారత్ నుంచి 1,38,899 మంది నాసా ద్వారా తమ పేరిట టికెట్లను బుక్ చేసుకున్నారు. 2018, మే 5న నాసా ప్రయోగించనున్న ఇన్‌సైట్ (ఇంటీరియర్ ఎక్స్‌ప్లోరేషన్ యూజిం గ్ సైస్మిక్ ఇన్వెస్టిగేషన్స్, జి యోడెసీ అండ్ హీట్ ట్రాన్స్‌పోర్ట్) మిషన్ ద్వారా వీరంతా అరుణ గ్రహానికి చేరుకోనున్నారు. వీరంతా భౌతికంగా అక్కడికి వెళ్తారని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరబడ్డట్టే..! విషయం ఏమిటంటే : అంగారక గ్రహానికి వెళ్లేందుకు పేర్లను బుక్ చేసుకున్న వారికి నాసా ఇప్పటికే ఆన్‌లైన్ బోర్డిండ్ పాసులను కూడా జారీచేసింది. వీరి పేర్లు మాత్రమే వెళ్తాయి. టికెట్లు బుక్ చేసుకున్న వారి పేర్లను పల్చని సిలికాన్ మైక్రోచిప్‌పై ఒక ఎలక్ట్రాన్ బీమ్‌ను ఉపయోగించి మనిషి వెంట్రుకలో వెయ్యో వంతు వ్యాసం ఉండే అక్షరాలతో రూపొందిస్తారు. ఈ చిప్‌ను ల్యాండర్ పైభాగంలో అమరుస్తారు. ఇన్‌సైట్ ద్వారా మార్స్‌పైకి పేర్లను పంపిస్తామన్న నాసా ఇచ్చిన పిలుపునకు ప్రపంచవ్యాప్తంగా 24.29 లక్షల మంది స్పందించారు. వారిలో భారతీయులు మూడోస్థానంలో నిలిచినట్టు నాసా బుధవారం పేర్కొన్నది.

ఈ జాబితాలో 6.76 లక్షల మందితో అమెరికా, 2.62 లక్షల మందితో చైనా, 1.38 లక్షల మందితో భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com