CISF సీజ్ చేసిన 1491 కేజీల బంగారం

- November 10, 2017 , by Maagulf
CISF సీజ్ చేసిన 1491 కేజీల బంగారం

సరైన లెక్కాపత్రం చూపించకుండా తెచ్చే బంగారం, వెండి, ఇతర వస్తువుల్ని ఎయిర్‌పోర్టుల్లో సీజ్ చేస్తారన్నది అందరికీ తెలిసిందే. ఈ కోటాలో, ఈ ఏడాది కాలంలో ఎంత బంగారం పట్టుబడిందో తెలుసా. 1491 కేజీలు. ఔను, సుమారు టన్నున్నర బంగారంను  CISF సీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 59 విమానాశ్రయాల్లో భద్రతను CISF చూస్తుంటుంది. గతేడాది నవంబర్ 8న నోట్ల రద్దు తర్వాత భద్రతాబలగాలకు కేంద్రం నుంచి ప్రత్యేక ఆదేశాలు వెళ్లాయి. ఎయిర్‌పోర్టుల్లో క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆర్థిక శాఖ కోరింది. దీంతో, నిఘాను మరింత పటిష్టం చేసి.. ఎక్కడికక్కడ అక్రమాలకు చెక్ పెట్టగలిగారు. ఈ ఏడాది కాలంలో 87 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, 1491 KGల బంగారం, 572 KGల వెండి కూడా సీజ్ చేశారు. వీటితోపాటు పదుల కేజీల వజ్రాభరణాలు, ఇతరవిలువైన వస్తువులను కూడా గుర్తించి వాటిని స్వాదీనం చేసుకున్నారు. అక్రమంగా బంగారం రవాణా చేస్తూ పట్టుబడ్డ కేసుల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టాప్‌లో ఉంది. అక్కడ ఏకంగా 498 కేజీల గోల్డ్ సీజ్  చేశారు. ముంబై విమానాశ్రయంలో 33 కోట్లకుపైగా నగదు దొరికితే, జైపూర్‌లో 266 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. CISF వీటన్నింటినీ IT అధికారులకు అప్పగించింది. ఆయా వ్యక్తులు వీటికి సంబధించి సరైన లెక్కలు చూపించని నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకునేందుకు చట్టబద్ధంగా ముందుకెళ్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com