సునీల్ హీరోగా మలయాళం మూవీ రీమేక్ "2 కంట్రీస్" డిసెంబర్‌లో విడుదల

- November 09, 2017 , by Maagulf
సునీల్ హీరోగా మలయాళం మూవీ రీమేక్

"జై బోలో తెలంగాణా" లాంటి యునానిమస్ హిట్ అనంతరం శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా  తెరకెక్కిన ఫిల్మ్  "2 కంట్రీస్". మలయాళంలో సూపర్ హిటైన ఈ మూవీని తెలుగులో  రీమేక్ చేశారు. ఈ సినిమాకి తెలుగులోనూ "2 కంట్రీస్" అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు దర్శకనిర్మాతలు.  షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ లో  ఈ సినిమా రిలీజ్ కానుంది.  సునీల్ సరసన మనీషా రాజ్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రంలో నరేష్, శ్రీనివాసరెడ్డి, పృధ్వీలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com