పెళ్లి పీటలు ఎక్కనున్న సోనమ్ కపూర్
- November 10, 2017
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ పెళ్లి కుదిరినట్టు సమాచారమ్. ఈ ముద్దుగుమ్మ కొత్త కాలంగా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ ఆహూజా ప్రేమలో ఉంది. ఇటీవలే ఈ జంట అమెరికా టూర్ కి వెళ్లింది. అక్కడ ఓ నెల పాటు ఎంజాయ్ చేసి వచ్చింది. ఈ టూర్ కి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకొంది సోనమ్.
అయితే, వీరి ప్రేమకు ఇంట్లో వారు కూడా పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. దీంతో.. వచ్చే యేడాది వీరి నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి వార్తలపై సోనమ్ కూడా స్పందించింది. ఇప్పటికైతే కేవలం పనితోనే బిజీగా ఉన్నానంది. మరోవైపు, 2018లో సోనమ్ పెళ్లి జరగడం ఖాయమని చెబుతున్నారు.
ప్రస్తుతం సోనమ్ 'వీరే ది వెడ్డింగ్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కరీనా కపూర్, స్వరా భాస్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది మే 18న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష