మాస్క్‌లు, ముస్సాలాహ్‌లలో వర్షం కోసం ప్రార్థనలు

- November 10, 2017 , by Maagulf
మాస్క్‌లు, ముస్సాలాహ్‌లలో వర్షం కోసం ప్రార్థనలు

వర్షం కోసం యూఏఈ వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అరబిక్‌లో సలాత్‌ అల్‌ ఇస్తిస్‌కాగా ఈ ప్రార్థనల్ని పేర్కొంటారు. యూఏఈ వ్యాప్తంగా మాస్క్‌లు, ముస్సాల్లాహ్‌లలో ఈ ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, ఈ ప్రార్థనల కోసం పిలుపునివ్వడం జరిగింది. అబుదాబీలోని షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మాస్క్‌లో జనరల్‌ అథారిటీ ఫర్‌ ఇస్లామిక్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ మొహమ్మద్‌ మట్టర్‌ అల్‌ కాబి ప్రత్యేక ప్రార్థనల్ని నిర్వహించారు. అల్లా, యూఏఈ మీద కరుణ చూపాలనీ, మంచి వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ప్రార్థించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com