చైనా ఓపెన్ కు దూరమైన కిదాంబి శ్రీకాంత్
- November 11, 2017
భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ సూపర్ సిరిస్‌కు దూరమయ్యాడు. నాగ్‌పూర్ వేదికగా ఇటీవల ముగిసిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్ కాలుకు గాయమైంది. ఈ నేపథ్యంలో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
దీంతో శ్రీకాంత్ నవంబర్ 14 నుంచి 19 వరకు జరిగే చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ సందర్భంగా శనివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడాడు. 'కాలు కండరాలు పట్టేయడంతో వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి సూచించారు. దీంతో నేను చైనా ఓపెన్ సూపర్ సిరీస్‌లో పాల్గొనడం లేదు' అని అన్నాడు. నాగ్‌పూర్‌లో జరిగిన జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గాయపడ్డాను. వారం రోజుల్లో తిరిగి నేను పూర్తిగా కోలుకుంటా. ఆ తర్వాత నవంబరు 21 నుంచి 26 మధ్య జరిగే హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో పాల్గొంటా' అని కిదాంబి శ్రీకాంత్ తెలిపాడు. ఈ ఏడాది వరుసగా నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలిచిన శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో ర్యాంకులో కొనసాగుతోన్నాడు.
చైనా సూపర్ సిరిస్‌కు దూరం కావడంతో నెంబర్ వన్‌గా నిలవాలనుకున్న శ్రీకాంత్ ఆశలు అడియాశలయ్యాయి. ఇదిలా ఉంటే జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో ఓడిన శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







