హైదరాబాద్లో కలకలం సృష్టించిన కాల్పులు
- November 11, 2017
హైదరాబాద్ నగరంలోని మైలార్దేవ్పల్లిలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. స్థానిక పీస్ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై జుబేద్ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జుబేద్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులకు ముస్తఫా సమాచారం ఇచ్చి ఉంటాడన్న అనుమానంతో జుబేద్ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితునికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష