న్యూయార్క్- దిల్లీ విమానసర్వీసులు రద్దు: కాలుష్యమే కారణం
- November 11, 2017
దిల్లీకి అంతర్జాతీయ విమాన సర్వీసులపై కాలుష్య ప్రభావం పడింది. యునైటెడ్ ఎయిర్లైన్స్ న్యూయార్క్-దిల్లీ విమాన సర్వీసులు రద్దు చేసింది. కాలుష్యంతో పాటు పొగమంచు తీవ్రంగా ఉండటంతో రెండు రోజుల పాటు విమాన సర్వీసులు రద్దు చేసినట్లు యునైటెడ్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. శనివారం, ఆదివారం దిల్లీకి చేరుకోవాల్సిన విమానాలు రద్దు చేసి ప్రయాణికుల టిక్కెట్లు రీ షెడ్యూల్ చేసినట్లు యునైటెడ్ సంస్థ ప్రకటించింది. కాలుష్యం తీవ్ర రూపం దాల్చడంతో దేశరాజధాని దిల్లీకి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య కూడా తగ్గింది. పొగ మంచు కారణంగా గత కొన్ని రోజులుగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష