నేను బాగానే ఉన్నా: కోట శ్రీనివాసరావు

- November 11, 2017 , by Maagulf
నేను బాగానే ఉన్నా: కోట శ్రీనివాసరావు

సోషల్ మీడియా ప్రచారంలో వచ్చిన దగ్గర్నుంచి తుమ్మినా దగ్గినా వార్తే. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో.. వారేం చేసినా ఎత్తి చూపుతూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ఇలాంటి వార్తల పట్ల వారు కూడా ఘాటుగానే స్పందిస్తుంటారు. ఒక్కోసారి బాధపడుతుంటారు. ఇదే విషయం ఇప్పుడు ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావుని కూడా ఇబ్బందికి గురి చేసిందట. నా ఆరోగ్యం విషమించిందని, ఆసుపత్రిలో చేరానంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో నిజం లేదని, అయినా 70 ఏళ్ల వయసులో చిన్న చిన్న అనారోగ్యాలు సహజమని, అందుకోసం హాస్పిటల్‌కు వెళ్లామే అనుకో.. దాని పెద్దగా చూపిస్తూ.. సీరియస్ అని డిక్లేర్ చేసేస్తారా అని ఒకింత బాధకు గురయ్యారు. ఈ తప్పుడు వార్తల ప్రచారం వల్ల కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బంధువుల నా ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నారు. నా అద‌ృష్టం కొద్దీ నాకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. తాజాగా జవాన్, బాలకృష్ణుడు చిత్రాల్లో నటించా.  మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నా అని చెప్పుకొచ్చారు. ఏదేమైనా ఈ విలక్షణ నటుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని మనసారా కోరుకుందాం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com