విమానంలో విషాదం
- November 11, 2017_1510412464.jpg)
సింగపూర్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ వృద్ధురాలు విమానంలోనే కన్నుమూసింది. సింగపూర్ నుంచి ఎయిర్ ఇండియా విమానం శనివారం తెల్లవారుజామున 2.30 గంటలకు చెన్నై చేరుకుంది. అందులో నాగపట్టణం జిల్లా మైలాడుదురై సమీపాన గల తిరుమంగళంకు చెందిన రహ్మత్‌గని (70) ఉంది. ప్రయాణీకులందరూ దిగి వెళ్ళినప్పటికీ రహ్మత్‌గని దిగలేదు. వెంట ఉన్న బంధువులు ఆమెను లేపేందుకు ప్రయత్నించగా సీటులోనే వాలిపోయింది. దీంతో వెంటనే ఎయిర్‌హోస్టెస్ ద్వారా చీఫ్ పైలట్‌కు విషయాన్ని తెలిపారు. అక్కడి నుంచి సమాచారం అందుకున్న విమానాశ్రయ అధికారులు, వైద్య బృందం వచ్చి రహ్మత్‌గనిని పరీక్షించగా ప్రయాణికురాలు గుండెపోటుతో మృతి చెందిందని తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి పంపారు. కుటుంబీకులకు సమాచారం అందించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష