అప్పుల్లో చైనా

- November 11, 2017 , by Maagulf
అప్పుల్లో చైనా

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా ప్రస్తుతం అప్పుల వూబిలో కూరుకుపోయిందట. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ జౌ జియోచౌన్‌ అన్నారు. ఈ మేరకు దేశ ఆర్థిక వ్యవస్థపై జౌ రాసిన ఆర్టికల్‌ను చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ తన వెబ్‌సైట్లో ఉంచింది.

తీవ్రస్థాయిలో ఉన్న అప్పుల కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడుతోందని పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా గవర్నర్‌ జౌ అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తుల్లో మరిన్ని ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. భవిష్యత్‌ సమస్యలను నివారించేందుకు ఆర్థిక సంస్కరణలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జౌ సూచించారు.

ఆర్థిక సంక్షోభం రాకుండా ఉండాలంటే జోంబీ కంపెనీలు(అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీలు) తీసేయాలని సూచనలు చేశారు. అప్పులు, వాటి వడ్డీ కట్టలేని స్థితిలో ఉన్న సంస్థలు అలాగే కొనసాగితే అది దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధికి ముప్పు కలిగిస్తుందని జౌ అభిప్రాయపడ్డారు. 15ఏళ్లుగా చైనా సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్‌గా పనిచేస్తున్న జౌ త్వరలో రిటైర్‌ కాబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com