'జర్నీ ఆఫ్‌ ద హైదరాబాద్‌ సిటీ పోలీస్‌' బుక్‌ను ఆవిష్కరించిన కేసీఆర్

- November 11, 2017 , by Maagulf
'జర్నీ ఆఫ్‌ ద హైదరాబాద్‌ సిటీ పోలీస్‌' బుక్‌ను ఆవిష్కరించిన కేసీఆర్

ప్రముఖ రచయిత్రి నూపుర్‌ కుమార్‌ రాసిన 'జర్నీ ఆఫ్‌ ద హైదరాబాద్‌ సిటీ పోలీస్‌' కాఫీ టేబుల్‌ బుక్‌ను సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో శనివారం ఆవిష్కరించారు. సిటీ పోలీస్‌ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌ నగర పోలీస్‌ వ్యవస్థ పురోగతిని తైలవర్ణ చిత్రాలతోసహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌ శర్మ, కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న మహేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 'ఫ్రెండ్స్‌ ఇన్‌ యూనిఫాం' పేరుతో తెలంగాణ పోలీస్ కు సంబంధించి నూతనంగా రూపొందించిన కాఫీ టేబుల్‌ బుక్‌, వీడియోఫిల్మ్‌తోపాటు ఆడియోసిడీని అనురాగ్‌శర్మ డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com