ప్రియాంకకూ తప్పని లైంగిక వేధింపులు
- November 12, 2017
ముంబయి: లైంగిక వేధింపులు.. ప్రస్తుతం బాలీవుడ్లో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. స్టార్ సెలబ్రిటీల నుంచి నిన్నమొన్న వచ్చిన వారంతా తామూ వేధింపులను ఎదుర్కొన్న వాళ్లమేనంటూ మీడియా ముందుకొస్తున్నారు. తాజాగా దీని గురించి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. ప్రియాంక సినిమా రంగంలోకి వచ్చిన తొలినాళ్లలో ఓ దర్శకుడి కారణంగా పది సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. 'ప్రియాంక ఓ ప్రముఖ దర్శకుడితో కలిసి పనిచేస్తున్నప్పుడు అతను అసభ్యకర దుస్తులు వేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఇందుకు ప్రియాంక ఒప్పుకోలేదు. పైగా మిస్ వరల్డ్ అయిన ప్రియాంక అందాలను అభిమానులకు చూపించకపోతే ఎలా అని మాట్లాడేవాడు. దాంతో ప్రియాంక ఆ సినిమా నుంచి తప్పుకొంది. ఆ తర్వాత అతని వల్ల పది సినిమా అవకాశాలు పోగొట్టుకుంది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రియాంక మూడు హాలీవుడ్ చిత్రాలతో పాటు ప్రముఖ అమెరికన్ టెలివిజన్ సీరీస్ 'క్వాంటికో'తో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష