కనబడకుండా పోయిన హరిరి...కిడ్నప్ చేసారా?
- November 12, 2017
బీరట్: లెబనాన్ ప్రధాని సాద్ హరిరి ఇటీవల ఆకస్మిక రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పట్నుంచీ ఆయన ఎక్కడ ఉన్నారనే విషయాలు తెలియడం లేదు. దీంతో లెబనాన్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు హరిరి సౌదీ అరేబియాలో కిడ్నాప్‌కు గురయ్యారంటూ వదంతులు రావడంతో లెబనాన్ అధ్యక్షుడు మైఖెల్ అవాన్ సౌదీ అరేబియాతో సంప్రదింపులు జరిపారు. తమ ప్రధాని ఇంతవరకూ స్వదేశానికి ఎందుకు తిరిగిరాలేదో చెప్పాలని కోరారు.
ఇటీవల సౌదీ అరేబియాలో పర్యటించిన హరిరి నవంబర్ 4న రియాద్‌లోని ఓ టెలివిజన్ ఛానల్ ద్వారా మాట్లాడుతూ తన రాజీనామాను ప్రకటించారు. ప్రస్తుతం లెబనాన్‌పై ఇరాన్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని.. అంతేగాక తన ప్రాణానికి ముప్పు ఉందని, తండ్రిలాగే తనను కూడా చంపేస్తారేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ తర్వాత ఆయన లెబనాన్ తిరిగి వెళ్లలేదు. దీంతో ఆయన వివరాలు తెలియడం లేదు.
మరోవైపు సౌదీలో హరిరి కిడ్నాప్‌కు గురయ్యారంటూ వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఈ విషయమై లెబనాన్ అధ్యక్షుడు మైఖెల్ అవాన్ సౌదీ రాజుతో మాట్లాడారు. హరిరి ఇంతవరకూ ఎందుకు తిరిగిరాలేదో తెలుసుకోవాలని కోరారు. కాగా.. హరిరి రాజీనామాను అవాన్ ఇంకా ఆమోదించలేదు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







