అక్కడ నివసించేది అందరూ మహిళలే! వారిని పాలించేది కూడా ఒక మహిళే!

- November 12, 2017 , by Maagulf
అక్కడ నివసించేది అందరూ మహిళలే! వారిని పాలించేది కూడా ఒక మహిళే!

'ఇది ఒక మహా మహిళొద్యమం' అంటున్నారు ఆ చిత్రనిర్మాతలు, 'వండర్‌ ఉమన్‌' సినిమా గురించి. అయితే 'ఆ చిత్రం గొప్పదే కావచ్చు కానీ, అది ఒక ఉద్యమం అనేంత సీన్‌ మాత్రం లేదు' అంటున్నారు హాలీవుడ్‌ పెద్దలు. ఆ చిత్రం మీద దర్శకురాలు ప్యాటీ జెన్‌కిన్స్‌కు చాలా ఆశలు ఉన్నాయి. 'నా జీవితంలో నేను దర్శకురాలిని కావటమే గొప్ప విషయం అనుకున్నాను. ఇప్పుడు ఇలాంటి చిత్రానికి దర్శకత్వం వహించడమనేది ఇంకా చాలా గొప్ప విషయం అనేది నాకు అర్థమవుతోంది' అని ఆమె ఎంతో ఉత్సాహంతో అంటున్నారు. హాలీవుడ్‌లో ఒక సూపర్‌ బడ్జెట్‌ చిత్రానికి ఒక మహిళ దర్శకత్వం వహించడం కూడా ఇదే ప్రథమం. 'వండర్‌ ఉమన్‌'గా గాల్‌ గడోట్‌ నటిస్తున్నారు. సెట్‌మీద గాల్‌ గడోట్‌ ఎంత ఎనర్జిటిక్‌గా నటించినా, దర్శకురాలు ప్యాటీకి అది సరిపోవటం లేదు. 'ఇంతేనా... ఇంకా బాగా నటించగల సీన్‌ ఇది.

నీ అంత గొప్ప నటి ఇక్కడ ఉండగా నేను ఈ మాత్రంతో సరిపెట్టుకోవటమా!' అంటూ మరీ ఉత్సాహపరిచి, ఆమె నుంచి మరింత ఉత్తమ నటనను రాబట్టుకుంటోంది. ఈ చిత్రకథ అంతా 'థెనిస్కిరా' అనే ఒకానొక ద్వీపంలో జరుగుతుంది. ఆ ద్వీపం ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ నివసించేది అందరూ మహిళలే! వారిని పాలించేది కూడా ఒక మహిళే!

ఈ చిత్రకథ, మన తెలుగు 'ప్రమీలార్జునీయము' చిత్రకథలా ఉందని మీరు అనుకున్నా పర్వాలేదు. 2001లో 'వెలాసిటీ రూల్స్‌' అనే చిత్రాన్నీ, 2003లో 'మాన్‌స్టర్‌' చిత్రాన్నీ నిర్మించి 'శభాష్‌' అనిపించుకున్న ప్యాటీ జెన్‌కిన్స్‌కు 'వండర్‌ ఉమన్‌' చిత్రం మరో కలికి తురాయి అవుతుందని అందరూ అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com