కృష్ణా నదిలో పడవ బోల్తా, 16 మంది మృతి
- November 12, 2017
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘోరం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా నదిలో ప్రయాణికులతో వెళ్తున్న బోటు బోల్తా పడింది. కృష్ణా నదిలో దాదాపు 40మందితో ప్రయాణిస్తున్న ఓ బోటు ప్రమాదవశాత్తు తిరగబడింది. కృష్ణా పవిత్ర సంగమం వద్ద హారతి చూసేందుకు రివర్ బోటింగ్ సంస్థకు చెందిన బోటులో ప్రయాణిస్తుండగా.. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండటంతో ఈ బోటు తిరగబడింది.
కాగా మృతులు ఒంగోలుకు చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటికే ఎన్‌డిఆర్ఎఫ్ బృందం ఘటనాస్థలికి చేరుకుంది. పోలీసులు, స్థానికులు మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు. నదిలో పడిన 15 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం: ఇబ్రహీంపట్నంలో బోటు బోల్తా పడి 12 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాలని ఆయన కలెక్టర్‌ను, డీజీపీని ఆదేశించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష