55 మంది భారత జాలర్లను అరెస్ట్‌ చేసిన పాక్

- November 12, 2017 , by Maagulf
55 మంది భారత జాలర్లను అరెస్ట్‌ చేసిన పాక్

భారత్‌కు చెందిన 55 మంది జాలర్లను పాక్‌ అదుపులోకి తీసుకుంది. ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలు పడుతున్నారంటూ వారిని ఆ దేశ తీర ప్రాంత గస్తీదళాలు అదుపులోకి తీసుకున్నాయి. జాలర్లకు చెందిన 9 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని పోలీసులకు అప్పగించామని, జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ ముందు వారిని హాజరు పరచనున్నామని తెలిపారు. అరేబియా సముద్రంలో చేపలు వేటాడే సమయంలో ఇలా ఇరు దేశాలకు చెందిన జాలర్లు గస్తీ సిబ్బందికి చిక్కడం తరచూ జరుగుతుంటుంది. ప్రాదేశిక జలాలకు సంబంధించి సరైన విభజన లేకపోవడం, జాలర్లు సాంకేతికతను ఉపయోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. గత నెల 29న 68మంది భారత జాలర్లను పాకిస్థాన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్‌ 2016 నుంచి జనవరి 2017 మధ్య మొత్తం 438 మంది జాలర్లకు పాక్‌ విముక్తి కలిగించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com