వచ్చే 48 గంటల్లో బలపడనున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన

- November 12, 2017 , by Maagulf
వచ్చే 48 గంటల్లో బలపడనున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన

శ్రీలంకకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం దానిపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది వచ్చే 48 గంటల్లో మరింత బలపడనున్నదని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో కూడిన బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ఒకటి రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో పొడివాతావరణం నెలకొంటుందని పేర్కొంది. కాగా మధ్య భారతంలో అధికపీడన ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com