భాగ్యనగరంలో మరో సంగీత విభావరి

- November 12, 2017 , by Maagulf
భాగ్యనగరంలో  మరో సంగీత విభావరి

దక్షిణ భారతావనిలో ఘనమైన చరిత్ర కర్ణాటక సంగీతానిది. ఎందరో మహానుభావులు ఈ సాంస్కృతిక సంపదని సుసంపన్నం చేశారు. సంగీతానికి ఎంతో సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మ గారి పేరున  సంగీత ప్రియులందరికీ ఆవిడను స్మరించుకునే అవకాశం HTO CLUB కలిగించింది. సుగంధాల గానాలు వెదజల్లే ఈ మహత్తర కార్యక్రమానికి “సుస్వర” పేరట సంగీత విభావరి నిర్వహించనున్నారు. 
ఈ “సుస్వర (Carnatic Fusion)” కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు లోని పది ప్రఖ్యాత సంగీతాలయాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ గాయనీ గాయకులు నిహాల్, శ్రీనిధి మరియు పృథ్వీచంద్రలు వారి గీతాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 14న ఫీనిక్స్ ఎరీనా, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో సాయంత్రం 04:00 గం.ల నుండి మూడు గంటల పాటు ఈ సంగీత విభావరి కొనసాగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com