భారత రక్షణ దళాల కోసం రష్యాతో త్వరలో 200 కమోవ్‌ హెలికాప్టర్ల ఒప్పందం

- November 12, 2017 , by Maagulf
భారత రక్షణ దళాల కోసం రష్యాతో త్వరలో 200 కమోవ్‌ హెలికాప్టర్ల ఒప్పందం

భారత రక్షణ దళాల కోసం 200 కమోవ్‌, ఎంఐ-17ఏ2 హెలికాప్టర్ల సరఫరాకు రష్యాతో త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. ఈ ఏడాది చివర్లోగానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ కమోవ్‌ హెలికాప్టర్ల ఒప్పందం ఖరారవుతుందని రష్యా హెలికాప్టర్స్‌ సీఈవో ఆండ్రేయ్‌ బోగినిస్కీ తెలిపారు. కేఏ-226టీ శ్రేణికి చెందిన ఈ తేలికపాటి లోహ విహంగాలను నౌకాదళంలో బహుళ అవసరాల కోసం ఉపయోగిస్తారు. 140 హెలికాప్టర్లను భారత్‌లో నిర్మిస్తారు. మిగతావాటిని నేరుగా రష్యా నుంచి కొనుగోలు చేస్తారు. మధ్యశ్రేణికి చెందిన ఎంఐ-17ఏ2 హెలికాప్టర్ల కొనుగోలుకూ ఒప్పందం కుదుర్చుకుంటామని ఆండ్రేయ్‌ తెలిపారు. ఇందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని.. అందువల్ల విశ్వసనీయత, భద్రత, సౌఖ్యం వంటి అంశాల్లో దీనికి తిరుగులేదని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com