ప్రతిపక్షం లేకుండా కూల్‌ కూల్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

- November 12, 2017 , by Maagulf
ప్రతిపక్షం లేకుండా కూల్‌ కూల్‌గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు

శని ఆదివారం సెలవుల తర్వాత అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  రెండో రోజుకొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. విజయవాడ కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో మరణించిన వారికి సభ్యులు సంతాపం తెలపనున్నారు. అనంతరం అసెంబ్లీలో నాలుగు బిల్లులు ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

నీటి పారుదల వ్యవస్థలను రైతులు నిర్వహించే చట్టానికి ప్రతిపాదించిన సవరణ బిల్లును సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవేశపెడతారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌ వడ్డీ వ్యాపారుల చట్టానికి సవరణ బిల్లును హోం మంత్రి చిన రాజప్ప సభలో పెడతారు. ఆంధ్రప్రదేశ్‌ పంచాయితీరాజ్‌ చట్టానికి సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి లోకేశ్‌, నాలా పన్నుకు సంబంధించి సవరణ బిల్లును రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రవేశపెడతారు. 

అసెంబ్లీలో నివేదికలు కూడా ప్రవేశ పెట్టనున్నారు. విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌కు సంబంధించిన నివేదికను ఆ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు, రాష్ట్ర వ్యవసాయాభివృద్ధి కమిషన్‌కు సంబంధించిన వార్షిక నివేదికను ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సభలో ప్రవేశపెడతారు.  ప్రతిపక్ష వైసీపీ సభ్యులెవరూ సభకు హాజరు కాకపోవడంతో సమావేశాలు ప్రశాంతంగా కొనసాగనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com