భారత రక్షణ దళాల కోసం రష్యాతో త్వరలో 200 కమోవ్ హెలికాప్టర్ల ఒప్పందం
- November 12, 2017
భారత రక్షణ దళాల కోసం 200 కమోవ్, ఎంఐ-17ఏ2 హెలికాప్టర్ల సరఫరాకు రష్యాతో త్వరలో ఒక ఒప్పందం కుదరనుంది. ఈ ఏడాది చివర్లోగానీ వచ్చే ఏడాది ఆరంభంలో కానీ కమోవ్ హెలికాప్టర్ల ఒప్పందం ఖరారవుతుందని రష్యా హెలికాప్టర్స్ సీఈవో ఆండ్రేయ్ బోగినిస్కీ తెలిపారు. కేఏ-226టీ శ్రేణికి చెందిన ఈ తేలికపాటి లోహ విహంగాలను నౌకాదళంలో బహుళ అవసరాల కోసం ఉపయోగిస్తారు. 140 హెలికాప్టర్లను భారత్లో నిర్మిస్తారు. మిగతావాటిని నేరుగా రష్యా నుంచి కొనుగోలు చేస్తారు. మధ్యశ్రేణికి చెందిన ఎంఐ-17ఏ2 హెలికాప్టర్ల కొనుగోలుకూ ఒప్పందం కుదుర్చుకుంటామని ఆండ్రేయ్ తెలిపారు. ఇందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని.. అందువల్ల విశ్వసనీయత, భద్రత, సౌఖ్యం వంటి అంశాల్లో దీనికి తిరుగులేదని వివరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష