బ్రిటన్ ప్రధాని థెరిసాకు సొంత పార్టీలో అసమ్మతి ఎదుర్కొంటున్నారు
- November 12, 2017
బ్రిటన్ ప్రధాని థెరిసా మే.. సొంత పార్టీలో అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. అధికార కన్సర్వేటివ్ పార్టీలో 40 మంది ఎంపీలు.. ఆమె నాయకత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కోరుతూ లేఖపై సంతకం చేసేందుకు ముందుకువచ్చారు. మరో ఎనిమిది మంది సభ్యులు మద్దతు పలికితే.. పార్టీలో అంతర్గతంగా నాయకత్వ పోటీ ఏర్పడుతుంది. థెరిసాను ఓడించిన అభ్యర్థి.. పార్టీ నాయకుడిగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. జూన్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన థెరిసా ప్రభుత్వానికి చుక్కెదురై.. పార్లమెంటులో మెజార్టీ తగ్గిపోయిన సంగతి తెలిసిందే. ఇటు బ్రెగ్జిట్‌పై భిన్నాభిప్రాయాలు, మంత్రులు వివాదాల్లో చిక్కుకోవడం కూడా ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారింది. వివిధ ఆరోపణలతో ఇటీవల ఇద్దరు కేబినెట్ మంత్రులు కూడా పదవులను వీడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే థెరిసా నాయకత్వంపై పార్టీలో విశ్వాసం సన్నగిల్లుతోంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!