షాపింగ్ మాల్ లో అల్లు అర్జున్
- November 13, 2017
వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ఓ షాపింగ్ లో జరుగుతోంది. అక్కడ హీరో-హీరోయిన్ అల్లు అర్జున్-అనూ ఇమ్మాన్యుయేల్ కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో బన్నీ జవాన్'గా కనిపించబోతున్నాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు వక్కంతం వంశీకి ఇదే తొలి సినిమా. అయినా.. ఇప్పటి వరకు తెరకెక్కించిన ఏపీసోడ్ సూపర్భ్ గా వచ్చాయని చెబుతున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైనోడు, డీజే సినిమాల తర్వాత బన్నీ నుంచి వస్తున్న సినిమా ఇది. దీంతో.. నా పేరు సూర్యపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయబోతున్నాడు. తెలుగు, తమిళ్ లోనూ ఈ సినిమా తెరకెక్కనుంది. హీరోయిన్ గా కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష