వ్యాయామం చేస్తూ మృతి చెందిన బహ్రెయినీ
- November 13, 2017
మనామా: ఓ వ్యక్తి వ్యాయామం చేస్తూ మృతి చెందిన ఘటన ఖాల్‌అత్ అల్ బహ్రెయిన్ (బహ్రెయిన్ ఫోర్ట్) వద్ద చోటు చేసుకుంది. బార్బర్ విలేజ్‌కి చెందిన ప్రముఖ ఇంజనీర్ అలీ అల్ షోవాయిక్‌గా మృతుడ్ని గుర్తించారు. సాయంత్రం 4 గంటల సమయంలో జాగింగ్ చేస్తూ, ఉన్నపళంగా కుప్పకూపోలిపోయారు షోవాయిక్. పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, అతన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందడం జరిగింది. ఈ ఏడాది ఇప్పటివరకు పది మంది వ్యాయామం చేస్తూ, ఆటలు ఆడుతూ ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్ అరెస్ట్‌తో షోవాయిక్ మృతి చెందినట్లు ధృవీకరించారు వైద్యులు. ఇలాంటి ఘటనల్లో ఫస్ట్ ఎయిడ్ ఎంతో ఉపకరిస్తుందనీ, ఉన్నపళంగా కుప్పకూలిపోయినవారికి అత్యవసరంగా వైద్య సహాయం అందిస్తే, ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







