ఆదివారం రాత్రి నుంచి చెన్నైలో మళ్లీ భారీ వర్షాలు
- November 13, 2017
- పాఠశాలలకు సెలవులు
కొంత విరామం తరువాత ఆదివారం రాత్రి మళ్లీ చెన్నై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం నుంగం బక్కమ్ వద్ద 52 మీమీ, మీనంబక్కమ్ వద్ద 18.2 మీమీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఉత్తర తీర ప్రాంతంలోనూ, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కొనసాగే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం జిల్లా కలెక్టర్లు సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చెన్నై జన జీవనం అస్థవ్యస్తంగా మారింది. రహదారులపై నీటి ప్రవాహం పొంగిపొర్లడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చొచ్చుకుని వచ్చింది. పూనమలీ హై రోడ్, చింతదిర్‌పేట్, కిల్‌పౌక్.. వంటి ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరికలు రావడంతో అధికారులు పూర్తి అప్రమత్తమయ్యారు.
చెన్నై కార్పొరేషన్‌లో ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!