హైఫా యుద్ధ స్మారక గీతం ఆవిష్కరణ
- November 14, 2017
ఇజ్రాయిల్: ప్రఖ్యాత గజల్ గాయకులు “మాస్ట్రో” డా. గజల్ శ్రీనివాస్ ఇజ్రాయిల్ లో తన శాంతి సుహృద్భావ పర్యటనలో భాగంగా 1918 సంవత్సరంలో ఇజ్రాయిల్ లోని హైఫాలో జరిగిన యుద్ధంలో భారతీయ సైనికులు కమాండర్ ధళపత్ సింగ్, కెప్టన్ అమన్ సింగ్ లు చూపిన శౌర్యానికి, మన భారతీయ సైనికులు సాధించిన విజయానికి గుర్తుగా హైఫా యుద్ద శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన హైఫా యుద్ద గీతాన్ని హైఫా సెక్రెటరీ జనరల్ బ్రాచా సెల హైఫా సిటీ హాల్ లో ఆ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రవికుమార్ అయ్యర్, హాంగ్ కాంగ్, బ్రిగేడియర్ మహేంద్ర సింగ్ జోధా లు హైఫా సెక్రెటరీ జనరల్ బ్రాచా సెల ను సత్కరించారు.
ఈ సందర్భంగా డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ హైఫా భారతీయ సైనికుల స్నేహానికి చిహ్నంగా “తీన్మూర్తి” స్థూపాన్ని హైఫా నగరంలో ఏర్పాటు చేయాలని హైఫా నగరంలో ప్రధాన కూడలిలకు కమాండర్ ధళపత్ సింగ్, కెప్టన్ అమన్ సింగ్ ల పేర్లను ఉంచాలని కోరారు. అనంతరం ఇండో- ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ ఫోరం సభ్యులు హైఫా యుద్ద స్మారక వీరుల చిహ్నం వద్ద పూల గుచ్చాన్ని, షాలువాను వుంచి భారతీయ సైనికులకు నివాళులు అర్పించారు. ఆనాడు భారతీయ సైన్యం యొక్క వీరత్వాన్ని చాటిన కెప్టన్ అమన్ సింగ్ మనుమడు బ్రిగేడియర్ మహేంద్ర సింగ్ జోధా ను హైఫా విశ్వవిధ్యాలయ కౌన్సిలర్ ఇత్-అమర్ ధీయోడర్ సత్కరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష