'హలో' ఐడియా అదిరింది
- November 14, 2017
త్వరలో 'హలో' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అక్కినేని వారసుడు అఖిల్, తన రెండో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేశాడు. మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అఖిల్ 'హలో' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను నవంబర్ 16న రిలీజ్ చేయనున్నారు. టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఓ ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష