తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- November 14, 2017
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఏపీ, తెలంగాణల్లోని వివిధ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతుండగా, హైదరాబాదు, రామగుండం, వరంగల్ తదితర జిల్లాల్లో 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. మోదకొండమ్మపాదాలు, లంబసింగిల్లో పది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, అరకు, పాడేరు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖపట్టణంలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో మన్యం వాసులు చలిపులికి బెంబేలెత్తిపోతున్నారు. కాగా, అరకు, పాడేరు ప్రాంతాల్లో వలిసె పూలు పర్యాటకులను అలరిస్తుండగా, లంబసింగిలో వాతావరణంలో మార్పులను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. కార్తీక మాసం కావడంతో పర్యాటకుల రద్దీ పెరుగుతోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష