సౌదీ అరేబియాలో చట్టవ్యతిరేక నివాస వ్యతిరేక ప్రచారం నేటి నుండి ప్రారంభం
- November 14, 2017
రియాద్ : నేటి నుండి సౌదీ అరేబియాలో చట్టవ్యతిరేక నివాస వ్యతిరేక ప్రచారం మొదలవుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి నోటీసు వచ్చేంత వరకు నవంబర్ 15 వ తేదీ 2017 నుండి ఉమ్మడి క్షేత్ర ప్రచారాన్ని నివాస, రవాణా మరియు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసీయులు, తరలించేవారు , మరియు నిర్వాహకులను లక్ష్యంగా చేసుకుని ఆ ఉల్లంఘనెలకు పాల్పడిన వారిని అరెస్టు చేయడం ప్రారంభిస్తుంది. రక్షణ, అధికారం మరియు సరిహద్దు భద్రతలను ఉల్లంఘించే వారికి మద్దతునివ్వడం, తీవ్రవాద చర్యలకు పాల్పడేవారిని దాచడం, అసాంఘిక శక్తులకు ఆశ్రయం కల్పించడం , రవాణా చేయడం, నిర్వహించడం వంటి పనులకు పాల్పడినవారిని నిషేధించడం నిబంధనలను మరియు సూచనలను అనుసరించి పౌరులు మరియు నివాసితులు మసులుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఉల్లంఘించినవారిపై (పౌరులు అలాగే నివాసితులు) గరిష్ట స్థాయిని గుర్తించారు. భద్రతా అధికారులతో, సహకారంతో, ఉల్లంఘనకారులను గూర్చి ఏదైనా సమాచారం ఉంటె లేదా 999 ఫోన్ కాల్ చేయాలనీ తెలిపారు. ఉల్లంఘనల ప్రస్తావన లేకుండా దేశం యొక్క లక్ష్యాలను సాధించడానికి ప్రజల సహకారం అందివ్వాలని మంత్రిత్వశాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







