కమర్షియల్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న యంగ్ హీరో నాగశౌర్య
- November 14, 2017
“ఊహలు గుసగుసలాడే”, “దిక్కులు చూడకు రామయ్య”, “లక్ష్మిరావే మా ఇంటికి”, “కళ్యాణవైభోగం”,” జ్యోఅచ్చుతానంద” లాంటి విభిన్న కథాంశాలతో విజయాలు సాధించి తెలుగు ప్రేక్షకుల్లో... ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ప్రత్యేక స్థానం సంపాదించాడు నాగశౌర్య. ఈ యంగ్ ఎనర్జిటిక్ హీరో వెంకి కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి ఇటీవలే ఛలో అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. నిర్మాతలు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ గా ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1 గా నిర్మిస్తున్నారు. ఛలో ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సిినిమాకు సంబంధించిన టీజర్ ను డిసెంబర్ 18న చేయనున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







