నారా రోహిత్‌-రేజీనా నటించిన "బాలకృష్ణుడు"కి గాత్రదానం చేస్తున్న జగపతిబాబు

- November 15, 2017 , by Maagulf
నారా రోహిత్‌-రేజీనా నటించిన

నారా రోహిత్‌-రేజీనా జంటగా డెబ్యూ డైరెక్ట‌ర్ ప‌వ‌న్ మ‌ల్లెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `బాల‌కృష్ణుడు`. స‌ర‌స్‌చంద్రిక విజ‌న‌రీ మోష‌న్ పిక్చ‌ర్స్, మాయా బ‌జార్ మూవీస్ ప‌తాకాల‌పై నిర్మిస్తున్నారు. ఇటీవల ఆడియో ఫంక్షన్ చేసుకున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్ ను ఫైనాల్ చేసింది. నవంబర్ 24న "బాలకృష్ణుడు" చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రానికి మ్యాన్లీ స్టార్ జగపతిబాబు వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com