శివ బాలాజీని ఏడిపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు
- November 15, 2017
హీరో శివబాలాజీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చెప్పలేనంత అభిమానం. ఆ అభిమానాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా వ్యక్తపరుస్తుంటాడు. కాటమ రాయుడు షూటింగ్లో పవన్‌కి జనసేన ఖడ్గం బహుకరించి పవన్ మనసుని మరోసారి గెలుచుకున్నాడు. అయితే ఈ బిగ్ బాస్ విన్నర్ నటించి, నిర్మించిన చిత్రం స్నేహమేరా జీవితం. ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా హిట్ కావాలంటూ పవన్ అభిమానులు శివకు మద్దతు పలుకుతున్నారు. సినిమా పోస్టర్‌కు హారతులిస్తున్నారు. దీనిపై స్పందించిన శివ ఇంతటి అభిమానాన్ని చూరగొన్నందుకు ఆనందంతో ఆనంద భాష్పాలు వచ్చాయని, ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం అంటూ.. మీకు సదా రుణపడి ఉంటానని ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







