యాపిల్ ఐఫోన్ 10లో లోపం.. వీడియో వైరల్!
- November 15, 2017
ఫేస్ ఐడీ.. ఇటీవల ప్రముఖ కంపెనీ యాపిల్ తీసుకొచ్చిన అత్యుత్తమ లాకింగ్ ఫీచర్. కంపెనీ పదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఐఫోన్ 10 (ఎక్స్)లో దీన్ని పొందుపరిచారు. ఫింగర్‌ప్రింట్‌తో పోలిస్తే అత్యంత భద్రతతో కూడుకున్నదిగా దీన్ని యాపిల్ పేర్కొంది. అయితే, ఫేస్‌ఐడీకి సంబంధించిన లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్‌ను తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే నిరూపితం కాగా.. తాజాగా ఓ తల్లీ, కుమారుడు చేసిన వీడియో వైరల్‌గా మారింది. తల్లీ కొడుకుల వేర్వేరుగా ఒకేఫోన్ ఫేస్‌ఐడీతో లాగిన్ అయినట్లు ఉన్న వీడియోతో ఈ సెక్యూరిటీ ఫీచర్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఫోన్ 10లో ఫేస్‌ఐడీ తీసుకొస్తున్నప్పుడు ఇది ఫింగర్‌ప్రింట్ కంటే ఎన్నో రెట్లు మెరుగైనదని యాపిల్ పేర్కొంది. ఫింగర్ ప్రింట్ విషయంలో 50 వేల సార్లలో ఒకసారి తప్పిదానికి ఆస్కారం ఉంటే.. ఫేస్‌ఐడీ విషయంలో 10 లక్షల సార్లలో ఒక్కసారి మాత్రమే పొరపాట్లకు అవకాశం ఉన్నట్లు యాపిల్ పేర్కొంది. అయితే, కవలలు, అన్నదమ్ములు, 13 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో తప్పిదానికి ఆస్కారమున్నట్లు యాపిల్ తన సెక్యూరిటీ టర్మ్స్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష