ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో “గజల్ గాంధీ గానం”
- November 15, 2017
ప్రఖ్యాత గజల్ గాయకులు “మాస్ట్రో” డా. గజల్ శ్రీనివాస్ ఇజ్రాయిల్ లో తన శాంతి సుహృద్భావ పర్యటనలో భాగంగా ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డా. గజల్ శ్రీనివాస్ “గోల్డెన్ డ్రీమ్స్ అఫ్ గాంధీజీ” అన్న మహాత్మాగాంధీ అహింసా సిద్దాంత గీతాన్ని హిబ్రు, హిందీ మరియు ఆంగ్ల బాషలలో గానం చేసి భారతీయుల యొక్క సత్యాగ్రహ, అహింసా సిద్దాంతాన్ని చాటిచెప్పారు. కొన్ని వందల సంవత్సరాల భారత్-ఇజ్రాయిల్ స్నేహ బంధాన్ని తన గానంలో గుర్తు చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇజ్రాయిల్ పార్లమెంట్ సభ్యులు విదేశి వ్యవహారాల డైరెక్టర్ జనరల్ Mr. యహుదాహ్ గ్లిక్ పాల్గొని డా. గజల్ శ్రీనివాస్ ను ఆలింగనం చేసుకుని, హిబ్రు భాషలో గానం చేసినందుకు అభినందించారు. హిబ్రు బాషలో పాడిన గీతాన్ని ఇజ్రాయిల్ పార్లమెంట్ కు అందించవలసిందిగా కోరారు. ప్రపంచంలో శాంతి సామరస్యం కోసం ఆ గీతాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా డా. గజల్ శ్రీనివాస్ ఇండో-ఇజ్రాయిల్ ఫ్రెండ్ షిప్ ఫోరం సభ్యులతో ఇజ్రాయిల్ ప్రధానమంత్రి Mr. బెంజమిన్ నేటాన్ యాహు కు, ఇజ్రాయిల్ పార్లమెంట్ సభ్యులు విదేశి వ్యవహారాల డైరెక్టర్ జనరల్ Mr. యహుదాహ్ గ్లిక్ కు భారత్-ఇజ్రాయిల్ మైత్రి జ్ఞాపికను శ్రీ రవికుమార్ అయ్యర్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 125 భాషలలో పాడి ప్రపంచ గిన్నీస్ రికార్డు సాదించినప్పుడు ఎంత ఆనందం కలిగిందో, ఈ రోజు హిబ్రు భాషలో గాంధీ గీతాన్ని ఇజ్రాయిల్ పార్లమెంట్ సెంట్రల్ హాలులో గానం చేసినందుకు అంతకంటే సంతోషం కలిగించిందని, ప్రపంచ శాంతికి తను చేస్తున్న కృషికి చక్కటి గౌరవం లభించిందని తెలియజేసారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







