బీరకాయ లో ఔషధ గుణాలు పుష్కలం

- November 15, 2017 , by Maagulf
బీరకాయ లో ఔషధ గుణాలు పుష్కలం

బీరకాయ తెలియని వారు ఉండరు. కానీ దానిలోని ఔషధ గుణాల గురించి చాలా తక్కువమందికి తెలుసు. బీరకాయ కూర, పచ్చడి బాగా ఫేమస్. బీరకాయ మనకు చేసే మేలు అంతాఇంతా కాదు. అసలు బీరకాయ గురించి తెలిస్తే అస్సలు వదలరు.
 
బీరకాయకు చలువ చేసే గుణం ఉంది. మన ఒంట్లోని అధిక వేడిని తీసివేస్తుంది. అందుకే బీరకాయను పథ్యానికి వాడుతారు. ఇది తింటే ఈజీగా జీర్ణమవుతుంది. మలబద్ధకాన్ని దూరం చేసి సాఫీగా వెళ్ళేట్లుగా దోహదం చేస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ ఎ-సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు బీరకాయలో ఉన్నాయి. జ్వరం తగిలిన వెంటనే లేత బీర పొట్టు వేపుడు పెడితే చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు పథ్యం కూరలా వాడతారు. కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
 
ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుతుంది బీరకాయ. డైటరీ ఫైబర్ అధిక బరువును కూడా తగ్గిస్తుంది. కామెర్ల వ్యాధికి కీలకపాత్ర పోషిస్తుంది బీరకాయ. యాంటి ఇంఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది. గుండెజబ్బు రాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తవృద్ధిని కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. రక్తలేమి సమస్య తగ్గిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com