'నేనే మైఖేల్' పాటలు విడుదల

- November 15, 2017 , by Maagulf
'నేనే మైఖేల్' పాటలు విడుదల

కలసాధన కృష్ణ దర్శకత్వంలో.. కలసాధన ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం నేనె మైఖేల్. ఈ సినిమాకు బిహారి బ్రదర్స్  నిర్మాతలుగా వ్యవహరించారు. చిన్నప్పటినుండి డాన్స్ నే ప్రాణంగా భావించే ఓ కుర్రవాడు ఎలా మైఖేల్ జాక్సన్ గా మారాడు అనేదే కథాంశం. దర్శకుడు కృష్ణ 550 మంది పిల్లలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తే వారు గొప్ప కళాకారులుగా తయారవుతారనే కాన్సెప్ట్ తో రూపొందించారు. ఈ చిత్రంలోని పాటలు మంగళవారం హైద్రాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో విడుదల అయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పాటల సీడీ ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో  బిజెపి ఎం ఎల్సీ రాంచందర్ రావ్, సాయి వెంకట్, అడబాల సురేష్ కుమార్, దర్శకుడు ప్రేమ్ రాజ్, రవి కిరణ్, డీసీపీ సుందర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com