47 వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఒమన్ ఎయిర్ ఉత్తేజకరమైన ఆఫర్ల శ్రేణి ప్రకటన

- November 16, 2017 , by Maagulf
47 వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఒమన్ ఎయిర్  ఉత్తేజకరమైన ఆఫర్ల శ్రేణి ప్రకటన

మస్కట్ :  సుల్తానేట్ లో నవంబర్ 18 వ తేదీ శనివారం  ఓమన్ 47 వ జాతీయ దినోత్సవ జరుపుకునే సందర్భాన్ని పునస్కరించుకొని ఒమన్ ఎయిర్, నేషనల్ క్యారియర్ అనేక ప్రత్యేకమైన ఉత్తేజకరమైన ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఒమన్ క్యాలెండర్ లో జాతీయదినోత్సవం అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటి, ఈ ప్రఖ్యాతమైన రోజున, ఒమన్ ఎయిర్ తన విక్రయాల నుండి 47 శాతం వరకు ప్రత్యేక ఆఫర్లతో విక్రయాలను నిర్వహిస్తోంది - ఇది నవంబరు 20 వ తేదీ లోపున బుక్  చేసేవారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మరియు ఈ ప్రయాణం  మే 30, 2018 లోపున పూర్తి కావాల్సి ఉందని ఒక వార్తాపత్రిక తెలిపింది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు సలాల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి అన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు ఒమాన్ ఎయిర్ యొక్క విస్తృతమైన నెట్వర్క్ సదుపాయం ఉంటుంది. కోళికోడ్ (కాలికట్), మనీలా, జెడ్డా, మదీనా, దోహా మరియు దేశీయ గమ్యస్థానాలకు ఈ ఆఫర్ చెల్లుతుంది. ఒమన్ ఎయిర్ డిప్యూటీ సీఈఓ, అబ్దుల్రహ్మాన్ అల్ బుషైదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మా జాతీయదినోత్సవాన్ని జరుపుకొంటున్నందుకు  మేము ఎంతో  సంతోషిస్తున్నామని అపూర్వమైన విమాన సేవలతో  ఒమన్ యొక్క పౌరులు మరియు నివాసితులను ఆకట్టుకొంటామని తెలిపారు.మెజెస్టి సుల్తాన్ కబూస్ బిన్ సెడ్ సమర్ధ పాలనలో జాతీయ దినం సందర్భంగా మా మంచి సంకల్పాన్ని పంచుకోవడానికి  ఒమన్ ఎయిర్ ప్రత్యేకమైన ఆఫర్లను అందచేయనుంది. మరియు మా విశ్వసనీయ అతిథులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాయని పేర్కొన్నారు. " విమాన టిక్కెట్లలో గరిష్టంగా 47 శాతం తగ్గింపు ఎయిర్ కనెక్షన్లకు కాకుండా, 18 కిలోల ఉచిత సామాను అనుమతి లభిస్తుంది. ఈ ఆఫర్లో చేర్చిన గమ్యాలు ఏమిటంటే లండన్, మాంచెస్టర్, మిలన్, జ్యూరిచ్, ప్యారిస్, మ్యూనిచ్, ఫ్రాంక్ఫర్ట్, బ్యాంకాక్, కౌలాలంపూర్, జకార్తా, మనీలా, కువైట్, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, గువాంగ్జో , ఖాసబ్ మరియు సలాల దేశీయ గమ్యాలు ఒమన్ ఎయిర్ అతిథులు నవంబర్ 18 న  ప్రయాణిస్తున్నవారు18 కిలోల అదనపు సామాను భత్యం,18 శాతం డిస్కౌంట్ ఇన్ఫ్లుట్ డ్యూటీ ఫ్రీ మరియు ఒమన్ ఎయిర్ యొక్క బిజినెస్ క్లాస్ లాంజ్ ను ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com