యూఏఈలో భారీ వర్షం: ఫుజైరఃలో రోడ్డు మూసివేత
- November 16, 2017
యూఏఈలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సమ్మర్ తర్వాత ఈ స్థాయిలో వర్షం కురవడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారీ వర్షం కారణంగా దుబాయ్, షార్జా, ఫుజారియాలో ప్రజలు ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. మసాఫి, దిబ్బా, వాడి అల్ హిలో, కల్బా రోడ్లలో పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే మారింది. ఈ వీకెండ్ ఇంకా ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు నేషనల్ మెటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది. హ్యుమిడిటీ ఎక్కువగా ఉండటంతో మేఘాలు ఎక్కువగా ఫామ్ అయి వర్షాలు కురుస్తున్నాయి. ఫుజారియాలో కొందరికి రెయిన్బో కన్పించడంతో ఆ దృశ్యాల్ని తమ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాలో ఆ ఫొటోల్ని షేర్ చేస్తున్నారు. ఇంకో వైపున లోతట్టు ప్రాంతాల్లోని రోడ్లపై వెళ్ళే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా యస్బా రోడ్ని రెండు వైపులా ట్రాఫిక్ బంద్ చేశారు. చిన్న చిన్న ల్యాండ్స్లైడ్స్ జారే ప్రమాదం ఉన్నందున ఈ చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష