సంచలనంగా మారిన జ్యోతిక డైలాగ్
- November 16, 2017
చెన్నై: బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం 'నాచ్చియార్'. జీవీ ప్రకాశ్ హీరోగా నటిస్తున్నారు. జ్యోతిక పోలీసు అధికారి పాత్ర పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. 53 సెకన్లపాటు సాగే ఈ టీజర్ కోలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. 'డార్లింగ్' నుంచి చాక్లెట్ బాయ్‌గానే గుర్తింపు తెచ్చుకున్న జీవీ ప్రకాశ్ ఇందులో బాలా శైలికి తగ్గట్లు భిన్నమైన లుక్‌లో కనిపిస్తుండడంతో సినీ విశ్లేషకులు, నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. తప్పకుండా ఈ చిత్రం జీవీ ప్రకాశ్ కెరీర్‌ను మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. మరోవైపు జ్యోతిక పాత్ర కూడా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పెళ్లి తర్వాత ఇంటికే పరిమితమైన ఆమె '36 వయదినిలే' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఇటీవల 'మగళీర్ మట్టుం'తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హోమ్లీగానే నటించిన ఆమె తాజాగా 'నాచ్చియార్'లో యాక్షన్ రంగంలోకి దిగారు.
టీజర్‌లోనే ఆమె పాత్ర ప్రత్యేకతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా టీజర్ చివర్లో ఆమె చెప్పిన డైలాగు అసభ్యకరంగా ఉండటంతో పలువురు విశ్లేషకులు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతికతో ఇలాంటి మాటలు పలికించడంపై బాలాను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఏదేమైనప్పటికీ టీజర్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలను పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







