అబ్బో అబ్బో అబ్బో, వాళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి: రామ్గోపాల్ వర్మ
- November 17, 2017
2014, 2015, 2016 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం నంది అవార్డులను మంగళవారం ప్రకటించింది. అయితే అవార్డుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, హేతుబద్ధంగా జరగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ నేతలు తమకు కావాలసినవారికి, సీఎం చంద్రబాబుకు చెందిన సామాజిక వర్గం వారికే అవార్డుకు ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు.
సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు బాహాటంగానే విమర్శించారు. ఈ అవార్డులకు అర్హుల ఎంపిక విషయంలో హేతుబద్ధత లేకుండా పోయింది.. అనే మాట గట్టిగా వినిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై సంచలనాలకు కేరాఫ్ దర్శకుడిగా పేరుగాంచిన రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు స్పందించాడు. ఫేస్బుక్లో తనదైన శైలిలో వ్యంగ్యంగా వర్మ ఫోస్టు చేశాడు. అర్హత ఉన్న సినిమాలకు అవార్డులు దక్కలేదని.. అనర్హమైన సినిమాలకు పెద్ద పీట వేశారనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టుమార్టం చేస్తూ.. ప్రభుత్వంపై, నంది అవార్డుల కమిటీపై ధ్వజమెత్తుతూ సోషల్ మీడియాలో బోలెడన్ని పోస్టింగులు వెల్లువెత్తుతున్నాయి...
అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా...వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్ ..నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు..
ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖఛ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్' అంటూ వర్మ పోస్ట్ చేశాడు. ఇక మామూలుగానే ఈ పోస్ట్ కి కూడా మద్దతుగా, వ్యతిరేకంగా కామెంట్లు వచ్చిపడుతూనే ఉన్నాయ్.
'లెజెండ్ సినిమాకి ఇచ్చిన అవార్డుల మీద కాంట్రవర్సీ ఏంటో నాకు అర్ధమవ్వట్లేదు.. అది కేవలం జెలసి ఉన్నవాళ్లు కాంట్రవర్సీ చేస్తున్నారు...నిజానికి జేమ్స్ కెమరూన్ గాని లెజెండ్ చూస్తే టైటానిక్ కి తన కొచ్చిన 11 ఆస్కార్ అవార్డుల్ని బోయపాటి శ్రీను కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం పెడతాడు' అంటూ డైరెక్ట్ గానే వేశాడు.
2014 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రం ఎంపిక పై విమర్శ. 'లెజెండ్' సినిమాను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం వివాదంగా మారుతోంది. అదే ఏడాది విడుదల అయిన 'మనం' సినిమాను ద్వితీయ ఉత్తమ చిత్రంగా ప్రకటించారు. అయితే లెజెండ్ తో పోలిస్తే 'మనం' చాలా గొప్ప సినిమా అనేది క్రిటిక్స్ మాట.
వైవిధ్యమైన కథా,కథనాలతో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. లెజెండరీ నటుడు ఏఎన్నార్ ఆఖరి సినిమా అది. ఏ రకంగా చూసినా లెజెండ్ కంటే మనం గొప్ప సినిమా అని, కానీ దాన్ని ద్వితీయానికి వేశారనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. ఎలాగూ లెజెండ్ లో హీరో టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యే కాబట్టి.. ఆ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించారనే విమర్శ కూడా తప్పడం లేదు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష