బాబు ని ప్రశంసలతో ముంచెత్తిన బిల్ గేట్స్

- November 17, 2017 , by Maagulf
బాబు ని ప్రశంసలతో ముంచెత్తిన బిల్ గేట్స్

విశాఖ: 20 ఏళ్ల క్రితం చంద్రబాబు విజన్‌ చూసి ఆశ్చర్యపోయానని సాప్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌ చెప్పారు. విశాఖలో నిర్వహిస్తున్న అగ్రిటెక్‌ ముగింపు సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా బిల్‌గేట్స్‌ హాజరైనారు. వ్యవసాయరంగంలో దేశానికి ఏపీ ఆదర్శంగా ఉంటుందని, వ్యవసాయం లాభసాటిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు. దేశంలో సగం మంది వ్యవసాయంపై ఆధారపడినవారేనని, చిన్న, సన్నకారు రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని, రైతులకు సాయపడితే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. రైతులు వ్యవసాయంలో పాతసంప్రదాయాన్ని వదిలిపెట్టాలని, మార్కెట్‌ కనెక్టివిటీ పెంచడంపై దృష్టిసారించాలని బిల్‌గేట్స్‌ పలు సూచనలు చేశారు. నాణ్యమైన విత్తనోత్పత్తిలో ఏపీ ముందుందని, కర్నూలు సీడ్‌ పార్క్‌కు సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విత్తనాలు విక్రయించే సంస్థలపై నమ్మకం పెరిగేలా చర్యలు తీసుకోవాలని బిల్‌గేట్స్‌ పేర్కొన్నారు.
విశాఖలో అగ్రీటెక్ మూడోరోజు జరుగుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం బిల్‌గేట్స్‌తో శాటిలైట్ భూసార పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకోనుంది. బిల్ మిలిందా గేట్ ఫౌండేషన్‌తో కీలకమైన ఒప్పందం చేసుకోబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి పూర్తి స్థాయి శాటిలైట్ ద్వారా భూసార పరీక్షలు చేయడానికి ఒప్పందం చేసుకోబోతున్నారు. అందుకోసం బిల్‌గేట్స్‌ విశాఖ వచ్చారని అధికారులు చెబుతున్నారు. ఇంతవరకు ఐటీ సెక్టార్‌ను ప్రమోట్ చేయడానికి వచ్చిన బిల్‌గేట్స్‌ మొదటిసారిగా వ్యవసాయ రంగానికి ప్రమోట్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఎంఓయూ జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com