ఉల్లంఘనలకు పాల్పడిన కార్లను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన అధికారులు సస్పెండ్
- November 17, 2017
కువైట్ : నిబంధనలు అమలులోకి వచ్చిన తరవాత ఉల్లంఘనలకు పాల్పడినవారిని ఊపేక్షించిన కొందరు అధికారులను జనరల్ ట్రాఫిక్ డిపార్టుమెంటు (జిటిడి) సస్పెండ్ చేయనుంది. వాహనాల డ్రైవర్లు సీట్ బెల్ట్లను ధరించకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, డ్రైవర్ మొబైల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నట్లయితే, వాహనాలను స్వాధీనం చేయకపోవచ్చని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ నిబంధన అమలులోనికి వచ్చిన 24 గంటల తర్వాత సరిగా చర్యలు తీసుకొని అధికారులను సస్పెండ్ చేశారు. నివేదిక ప్రకారం, మొదటి 24 గంటల్లో పౌరులకు మరియు నివాసితులు చెందిన 1,000 కి పైగా కార్లను స్వాధీనం చేసుకున్నారు. కొందరు పార్లమెంట్ సభ్యులతో సహా పెద్ద సంఖ్యలో పైన పేర్కొన్న ఉల్లంఘనలకు పాల్పడిన కార్లను చేజిక్కించుకోవడానికి అధికారులు అంతగా ఉత్సాహాన్ని చూపకుండా నిర్లక్ష్యంతో వదిలివేస్తున్నట్లు గుర్తించింది.కొందరు అధికారులకు ఈ నిబంధనల పట్ల అంతగా ఆసక్తి లేదు తెలుస్తోంది. అయితే మరికొందరు అధికారులు ఖచ్చితమైన విధానాలు అమలుచేయడంతో అనేక మంది పౌరులు,p ప్రవాసీయులు కారులను అద్దెకి ఇచ్చే కార్యాలయాల చుట్టూ మొదటి రోజున ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







