ఢిల్లీలో తెలంగాణ మేయర్ల బృందం

- November 17, 2017 , by Maagulf
ఢిల్లీలో తెలంగాణ మేయర్ల బృందం

నగరంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ కాంప్లెక్స్‌ను తెలంగాణ మేయర్ల బృందం పరిశీలించింది. డిజిటల్‌ హెల్త్‌ క్లినిక్‌, వెం డింగ్‌ మెషిన్‌, ఏటీఎం, మినరల్‌ వాటర్‌ మిషన్లను మేయర్లు ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యూఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధి కారులు తెలంగాణ మేయర్ల బృందానికి శుక్రవారం ఢిల్లీలో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు దేశంలో వివిధ పట్టణాల్లో పర్యటించి స్వచ్ఛత, పరిశురఽభత పనులపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. హైటెక్‌ నర్సరీ, ఓపెన్‌ జిమ్‌, ల్యాండ్‌స్కేపింగ్‌ వంటివి తమను ఆకర్శి తుల్ని చేశాయని అన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ... ఢిల్లీ స్టడీ టూర్‌లో కీలక ప్రాజెక్టులను పరిశీలించామన్నారు. ఈ బృం దంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో పాటు కరీం నగర్‌ మేయర్‌ రవీందర్‌ సింగ్‌, ఖమ్మం మేయర్‌ పాపాలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com