డిస్నీల్యాండ్ లో సందడి చేస్తున్న ప్రిన్స్ ఫ్యామిలీ...!!

- November 17, 2017 , by Maagulf
డిస్నీల్యాండ్ లో సందడి చేస్తున్న ప్రిన్స్ ఫ్యామిలీ...!!

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు.. సినిమా షూటింగ్ గ్యాప్ దొరికితే.. తన కుటుంబ సభ్యులతో గడపడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఇక షూటింగ్ కి గ్యాప్ దొరికితే.. భార్య పిల్లలతో.. విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తాడు. తాజాగా మహేష్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం అమెరికా వెళ్లారట. ఆయనతో పాటు.. నమ్రత, గౌతమ్, సితారలు కూడా వెళ్లారు. కాగా ఈ ట్రిప్ లో మహేష్ ఫ్యామిలీతో పాటు.. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నే కూడా తన కుటుంబంతో వెళ్ళినట్లు ఫోటోలు చూస్తే తెలుస్తుంది. మహేష్ బాబు కుమారుడు గౌతమ్, కుమార్తె సితారలతో పాటు నవీన్ ఎర్నే పిల్లలు కలిసి పోయి.. ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేశారు.. రెండు కుటుంబాలు అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు తిరుగుతూ.. ఈ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారట.. ట్రిప్ లో భాగంగా... డిస్నీల్యాండ్, టుమారో ల్యాండ్, హాలీవుడ్ స్టూడియో వంటి వాటిని చుట్టేస్తున్నారు. కొన్ని ప్లేస్ లకు బై రోడ్ వెళ్లారట. రెండు రోజుల్లో తిరిగి ఇండియా రానున్న మహేష్ బాబు,... వెంటనే కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com