వాహనదారులకు రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు ఉచితం.!

- November 18, 2017 , by Maagulf
వాహనదారులకు రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు ఉచితం.!

ప్రభుత్వం గత కొన్ని నెలల క్రితం ప్రవేశ పెట్టిన రవాణా శాఖ ఆన్‌లైన్‌ సేవలు ఇకపై ఉచితంగా పొందడానికి అధికారులు వెసులుబాటు కల్పించారు. దీనికి సంబంధించి శుక్రవారం విజయవాడ డీటీసీ కార్యాలయంలో వాహన అధీకృత డీలర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వాహనాదారులకు ఉచితంగా ఆన్‌లైన్‌ సేవలు అందించే విషయంపై చర్చించారు. దీనికి డీలర్లు ఒప్పుకోవడంతో సమస్యకు మోక్షం కలిగింది. ఈ క్రమంలో శనివారం నుంచి రవాణా శాఖకు సంబంధించిన అన్ని ఆన్‌లైన్‌ సేవలు ఉచితంగా గుర్తింపు పొందిన అధీకృత డీలర్ల వద్ద నుంచే పొందేలా ఆదేశాలు జారీ చేశారు. దీనికి డీలర్లు సైతం అంగీకరించడంతో వాహనదారులకు ఊరట కలిగింది.

ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ ఎల్‌ఎల్‌ఆర్‌లు, రిజిస్ర్టేషన్లు అన్నీ నిర్ణయించిన ఫీజు చెల్లించి మీ- సేవా కేంద్రాల ద్వారా శ్లాట్‌లు పొందేవారు. ఇచ్చిన తేదీల్లో రవాణా శాఖ కార్యాలయాల వద్దకు వెళ్లి టెస్ట్‌ నిర్వహించిన పిదప ఎల్‌ఎల్‌ఆర్‌లు జారీ చేసేవారు. ఈ విధానం నుంచి వాహనదారులకు విముక్తి కలిగించారు. ఇకపై జిల్లాలో గుర్తింపు పొందిన 100 మంది అధీకృత డీలర్ల వద్దకు వెళ్లి ఉచితంగా ఆన్‌లైన్‌ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.

ఇకపై అధీకృత డీలర్ల వద్ద నుంచి రవాణా శాఖకు సంబంధించిన డూప్లికేట్‌ ఆర్‌సీలు తీసుకోవడం, అడ్రస్‌ మార్పు, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఓనర్‌షిప్పు, సీసీలు పొందడం, ఫైనాన్స్‌ ద్వారా వాహనాలు కొనాలన్నా, ఎల్‌ఎల్‌ఆర్‌లు, డీఎల్‌లు, ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌లు, ఫిట్‌నెస్‌ పారాలు రాసి భర్తీ చేయడం వంటి అన్ని రకాల ఆన్‌లైన్‌ సేవలు పొందవచ్చు. అన్ని సేవలు డీలర్ల వద్ద నుంచి ఉచితంగా పొందే వెసులుబాటు కల్పించడం పట్ల వాహనాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com