రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్న శంకర్
- November 18, 2017
రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తున్నాడు. భారీ ఆశలతో ఎదురుచూస్తోన్న సినీలవర్స్ ను డిసప్పాయింట్ చేస్తున్నాడు. టు పాయింట్ ఓ వస్తోంది, సూపర్ స్టార్ మేజిక్స్, శంకర్ మేకింగ్ తో థ్రిల్ అవుదామనుకున్న సిల్వర్ స్క్రీన్ ను నిరాశపరుస్తూ ఈసినిమా పోస్ట్ పోన్ అవుతోంది.
టు పాయింట్ ఓ జనవరి25న రిలీజ్ అవుతుందనగానే మరికొన్ని రోజుల్లో ఓ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ను చూడబోతున్నామని సినీజనాలంతా ఫిక్స్ అయ్యారు. శంకర్ 450కోట్లకు పైగా బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తోన్న ఈసినిమా ఓ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని ఇండస్ట్రీ కూడా ఫిక్స్ అయ్యింది. పైగా హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈసినిమాకు వర్క్ చేస్తుండడంతో టు పాయింట్ ఓ, బాహుబలి రికార్డులను తిరగరాస్తుందనే టాక్ కూడా స్టార్ట్ అయ్యింది.
2డి, 3డిల్లో రూపొందుతోన్న ఈసినిమా లాంచింగ్ టైంలోనే హైప్స్ క్రియేట్ చెయ్యడం, అక్షయ్ కుమార్ విలన్ గా కనిపిస్తుండడంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. పైగా ఐ సినిమా అనుకున్నంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో శంకర్ టు పాయింట్ ఓ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన విజన్ తో సౌత్ సినిమాకు కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు. దీంతో 2018జనవరి25ను ఇండియన్ సినిమా మార్క్ చేసి పెట్టుకుంది.
ఇండియన్ ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న ఈ సినిమా జనవరి25కి రిలీజ్ కావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే గ్రాఫికల్ వర్క్ ఇంకా బాలెన్స్ ఉందట. హై గ్రాఫికల్ వండర్ ను అందించాలనుకుంటోన్న శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడట. పర్ఫెక్ట్ అవుట్ పుట్ నే ప్రేక్షకుల మందుకు తీసుకురావాలనుకుంటున్నాడట. సో ఈసినిమా రిపబ్లిక్ డే నుంచి సమ్మర్ కు పోస్ట్ పోన్ అవుతుందట. అందుకే అక్షయ్ కుమార్ తన పాడ్ మాన్ ను జనవరి26న రిలీజ్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







