వాడి వరదలు: 5 మందిని సురక్షితం, ఒకరి మిస్సింగ్
- November 18, 2017
వాడి వరదల్లో ఐదుగురు భారతీయులు కొట్టుకుపోతుండగా వారిని రక్షించారు. అయితే మరొకరు మాత్రం ఈ ఘటనలో గల్లంతయ్యారు. ఈస్టర్న్ రీజియన్ పోలీస్ రెస్క్యూ యూనిట్ 18 ఏళ్ళ స్టూడెంట్ వరదల్లో గల్లంతయినట్లు తెలిపింది. ఎయిర్ వింగ్ పోలీస్‌తో కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతయిన వ్యక్తిని ఆల్బర్ట్ జాయ్‌గా గుర్తించారు. వర్షాల్లో డ్రైవింగ్‌ని ఎంజాయ్ చేయడం కోసం అల్బర్ట్ రాయ్ తన స్నేహితులతో కలిసి వెళ్ళగా, దురదృష్టం వీరిని వెంటాడింది. భారీ వర్షాల కారణంగా తలెత్తిన ఆకస్మిక వరదలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం కొట్టుకుపోయింది. అందులోంచి ఐదుగురు రక్షింపబడ్డారు. గల్లంతయిన వ్యక్తిని రస్ అల్ ఖైమాలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా పేర్కొన్నారు పోలీసులు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష