'అమ్మాయిలంతే..అదో టైపు' డిసెంబర్ లో రిలీజ్

- November 18, 2017 , by Maagulf
'అమ్మాయిలంతే..అదో టైపు' డిసెంబర్ లో రిలీజ్

తెలుగు ప్రజలు బంధాలు అనుబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. అందుకే దర్శకనిర్మాతలు అలాంటి సినిమాలు తెరకెక్కించడానికి ముందు ఉంటారు. ఆ కోవ‌లోనే ఆక‌ట్టుకోబుతున్న ఆస‌క్తిక‌ర‌మైన ఫిల్మ్ అమ్మాయిలంతే ..అదో టైపు. ఓ తొంద‌ర‌పాటు నిర్ణ‌యం...తండ్రి -కూతుళ్ల మ‌ధ్య దూరం ఎలా పెంచింది? త‌ండ్రి ప్రేమ‌కు దూర‌మైన కూతురు అనుభ‌వించే బాధ, ఆ క్ర‌మంలో సంఘటనల సమాహారమే ఈ చిత్రం.  ఇందులో  గోపి వర్మ, మాళ‌విక మీన‌న్‌ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. శివాజీ రాజా కీలక పాత్ర పోషిస్తున్నారు. గాయ‌త్రి రీల్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. డిసెంబర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు స‌న్నాహాలు చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com